జగన్ పాలనకు బ్రహ్మరథం... చంద్రబాబు సానుభూతి వ్యూహాలందుకే: హోంమంత్రి వనిత
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఇటీవల టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు హోమంత్రి తానేటి వనిత కౌంటరిచ్చారు.
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఇటీవల టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు హోమంత్రి తానేటి వనిత కౌంటరిచ్చారు. అధికారంలోకి వచ్చింది మొదలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని... ప్రజలంతా బ్రహ్మరథం పడుతుంటే చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సామాన్య నేతలు, మహిళా నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఏమోగాని... స్వయంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా వున్న చంద్రబాబు నాయుడు కూడా అలాగే మాట్లాడటం దారుణమన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటున్న చంద్రబాబుకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తోందని... కర్నూలు పర్యటనలో ఆయనను నిలదీయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే పరిస్ధితి లేదు కాబట్టే సానుభూతి వ్యూహాలతో వెళుతున్నారని వనిత పేర్కొన్నారు.