కరోనా మీదా ఇంటింటికీ తిరిగి అవగాహన.. కలెక్టర్లతో నీలం సాహ్ని
విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి విమానాలు, రైళ్ళు, బస్సులు మరే ఇతర మార్గాల ద్వారా జిల్లాలకు చేరుకున్న వారిని స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్ కు లేదా ఇనిస్టిట్యూ షనల్ క్వారంటైన్లలో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి విమానాలు, రైళ్ళు, బస్సులు మరే ఇతర మార్గాల ద్వారా జిల్లాలకు చేరుకున్న వారిని స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్ కు లేదా ఇనిస్టిట్యూ షనల్ క్వారంటైన్లలో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు ప్రజల్లో పూర్తి అవగాహన కలిగించేందుకు ఐఇసి యాక్టివిటీని పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. హోం క్వారంటైన్ కు సంబంధించి కోవిడ్ ఆర్డర్ సంఖ్య 51, 52 లను విధిగా పాటించాలని చెప్పారు.