Asianet News TeluguAsianet News Telugu

ఈ అమ్మాయిల పోలీస్ కలలపై నీళ్లుచల్లిన జన్మభూమి ఎక్స్ ప్రెస్...

కాకినాడ : 'నీవు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు' అని ఓ తెలుగు కవి మాటలు భారత రైల్వే టైమింగ్ సరిగ్గా సరిపోతుంది.

కాకినాడ : 'నీవు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు' అని ఓ తెలుగు కవి మాటలు భారత రైల్వే టైమింగ్ సరిగ్గా సరిపోతుంది. మనం ఎక్కాల్సిన రైలు సమయానికి వస్తుందని, సమయానికి గమ్యం చేరుస్తుందని నమ్మలేం. అలాంటిది ఇవాళ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి రైల్లో బయలుదేరిన ఇద్దరు అమ్మాయిలు నిర్ణీత సమయానికి ఎగ్జామినేషన్ సెంటర్ కు చేరుకోలేకపోయారు. దీంతో పోలీస్ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మాయిల ఆశలు ఆవిరయ్యారు. 

కాకినాడ జేఎన్టియూలో కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి ఇద్దరు అమ్మాయిలు అనకాపల్లి నుండి జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. అయితే రైలు ఆలస్యమవడంతో అమ్మాయిలిద్దరూ 10 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతివ్వకపోవడంతో అమ్మాయిలిద్దరిని కూడా అధికారులు వెనక్కి పంపించారు. విద్యార్థినులు రైలు ఆలస్యమయ్యిందంటూ మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయింది.