విశాఖపట్నంలో కాన్వాయ్‌ ఆపి ప్రజల సమస్యలు విన్న ముఖ్యమంత్రి.. సాయం అందించాలని ఆదేశాలు..

విశాఖపట్నం : విశాఖపట్నం పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ తన కాన్వాయ్‌ ఆపి ప్రజల సమస్యలు విన్నారు. 

First Published Aug 27, 2022, 12:29 PM IST | Last Updated Aug 27, 2022, 12:29 PM IST

విశాఖపట్నం : విశాఖపట్నం పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ తన కాన్వాయ్‌ ఆపి ప్రజల సమస్యలు విన్నారు. శ్రీకాకుళం జిల్లా డీఆర్‌ వలస గ్రామానికి చెందిన కూలీలు పాండ్రంకి రామారావు, సుబ్బలక్ష్మి సీఎంని కలిసి తమ బిడ్డల అనారోగ్య సమస్యను వివరించి.. శస్త్రచికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరారు. తమ కుమారులిద్దరూ సికిల్‌బెడ్‌ థలసేమియాతో భాదపడుతున్నారని, వారి శస్త్రచికిత్సకు ప్రభుత్వం సాయం అందించాలంట విన్నవించుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్ధితి చూసి చలించిపోయిన వైఎస్‌ జగన్, వారికి అవసరమైన సాయం చేయాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. అలాగే పెదవాల్తేరుకు చెందిన ధర్మాల త్రివేణి సీఎంను కలిసి తన సమస్య చెప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితం తన భర్త హత్యకు గురయ్యాడని, ఇద్దరు చిన్న పిల్లలతో తన కుటుంబ పోషణ భారంగా మారిందని సీఎంకి  త్రివేణి వివరించింది. త్రివేణి కుటుంబానికి తగిన న్యాయం చేయమని విశాఖ జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.