అచ్యుతాపురం సెజ్ లో రూ.2వేల కోట్లతో భారీ పరిశ్రమ... ప్రారంభించిన సీఎం జగన్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో యకహోమా గ్రూప్ 2,200 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ‘ఏటీసీ టైర్ల ' పరిశ్రమను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో యకహోమా గ్రూప్ 2,200 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ‘ఏటీసీ టైర్ల ' పరిశ్రమను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అలాగే ఇదే సెజ్ లో ఏర్పాటుకానున్న 8 భారీ పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేసారు. మొత్తం 2049 ఎకరాల్లోని ఏర్పాటుచేసిన అచ్యుతాపురం సెజ్ లో మూడు వేల 202 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. వీటి ద్వారా 4వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వైసిపి ప్రభుత్వం చెబుతోంది.