Asianet News TeluguAsianet News Telugu

స్పందనపై కలెక్టర్లతో వైఎస్ జగన్ సమీక్ష

స్పందన కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

First Published Feb 25, 2020, 5:54 PM IST | Last Updated Feb 25, 2020, 5:54 PM IST

స్పందన కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరంతా చొరవ తీసుకుంటేనే ఇది విజయవంతం అవుతుందన్నారు. స్పందనకి సంబంధించిన అభ్యర్ధన వచ్చినప్పుడు రశీదు ఇస్తామన్నారు. ప్రజల సమస్యను తీర్చినప్పుడు వాళ్ళకు అది అందిన విషయాన్ని ధృవీకరించే సాంకేతికతను ఏర్పరుచుకోవాలని సీఎం సూచించారు. స్పందనను నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అంటే గ్రామ సచివాలయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని జగన్ తెలిపారు