ఏపీ రైతులకు జగన్ తీపి కబురు.. రూపాయి కడితే చాలు..
ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించింది.
ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించింది. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ చెల్లింపులు ప్రారంభించారు. 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా డబ్బు జమ చేశారు. 2019-20 నుంచి రైతులకు ఉచితంగా వైఎస్‌ఆర్ రైతు బీమా అమలవుతోంది. బీమా పరిహారం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని సీఎం జగన్ అన్నారు.