రైతన్నలకు సీఎం జగన్ గుడ్ న్యూస్... ఒక్క బటన్ నొక్కి రూ. 200 కోట్లు విడుదల

తాడేపల్లి : రబీ 2020–21, ఖరీఫ్‌–21 సీజన్‌ల సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్‌–2022 సీజన్‌కు చెందిన ఇన్‌పుట్‌ సబ్సిడీని వైసిపి ప్రభుత్వ రైతుల ఖాతాలో జమచేసింది. 

First Published Nov 28, 2022, 5:26 PM IST | Last Updated Nov 28, 2022, 5:26 PM IST

తాడేపల్లి : రబీ 2020–21, ఖరీఫ్‌–21 సీజన్‌ల సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్‌–2022 సీజన్‌కు చెందిన ఇన్‌పుట్‌ సబ్సిడీని వైసిపి ప్రభుత్వ రైతుల ఖాతాలో జమచేసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి రూ.199.94 కోట్లను విడుదల చేసారు. రబీ 2020–21 సీజన్‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ. 45.22 కోట్లు, ఖరీఫ్‌–2021 సీజన్‌లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ. 115.33 కోట్లు విడుదల చేశారు. అలాగే ఖరీఫ్‌–2022 సీజన్‌లో జూలై నుంచి అక్టోబర్‌ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 45,998 మంది రైతులకు రూ. 39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేసి అండగా నిలిచారు.