కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న గొప్ప మహిళ ద్రౌపది ముర్ము : వైఎస్ జగన్

విజయవాడ : రెండురోజుల పర్యటనలో భాగంగా ఏపీకి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసన్మానం చేసింది. 

First Published Dec 4, 2022, 1:43 PM IST | Last Updated Dec 4, 2022, 1:43 PM IST

విజయవాడ : రెండురోజుల పర్యటనలో భాగంగా ఏపీకి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసన్మానం చేసింది. విజయవాడ పోరంకిలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతిని కొనియాడారు.  కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ద్రౌపది ముర్ము జీవితం ప్రతి మహిళకు ఆదర్శనీయం... ఆమె ఉదార్తమైన జీవితం దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని అన్నారు. ముర్ము కేవలం సామాజిక వేత్త, ప్రజాస్వామ్య వాది, అణగారిన వర్గాల కోసం అచెంచలమైన కృషి చేసిన వ్యక్తి మాత్రమే కాదు గొప్ప మహిళ అని సీఎం జగన్ అన్నారు. 
 భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రపతి పదవిని గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చేపట్టడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత మొదటిసారి ఏపీకి విచ్చేసిన ద్రౌపది ముర్మును గౌరవించడం రాష్ట్రప్రజలందరి బాధ్యతగా భావించే రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.