పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ ... ఎట్టకేలకు ఇప్పటంలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు
గుంటూరు : మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ది కోసమంటూ ఇప్పటంలో ఇళ్లు, మహనీయుల విగ్రహాల కూల్చివేతపై వివాదం రేగిన విషయం తెలిసిందే.
గుంటూరు : మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ది కోసమంటూ ఇప్పటంలో ఇళ్లు, మహనీయుల విగ్రహాల కూల్చివేతపై వివాదం రేగిన విషయం తెలిసిందే. మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధి విగ్రహాలను తొలగించిన అధికారులు ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించకపోవమే కాదు ముళ్లకంచె వేసిమరీ పోలీస్ రక్షణ ఏర్పాటుచేసారు. ఇప్పటం పర్యటన సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇదేంటని పోలీసులను, అధికారులను ప్రశ్నించారు. గాంధీజి వంటి మహనీయుల విగ్రహాలు తొలగించి వైఎస్సార్ విగ్రహాన్ని అలాగే వుంచడంపై ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో అధికారులు స్పందించారు. ఇవాళ విగ్రహాన్ని తొలగించిన అధికారులు క్రేన్ సాయంతో తరలించారు.