Asianet News TeluguAsianet News Telugu

కుటుంబసమేతంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్...

కడప : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. 

First Published Dec 25, 2022, 10:53 AM IST | Last Updated Dec 25, 2022, 10:53 AM IST

కడప : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్టియన్లు ఎంతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో మూడురోజుల పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో రెండో రోజయిన శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబసమేతంగా ఇడుపులపాయ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్. ఇక ఇవాళ(ఆదివారం) క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రార్థనల్లో పాల్గొననున్నారు.