Asianet News TeluguAsianet News Telugu

ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు... ప్రేమగా తిరుపతి లడ్డూ తినిపించిన చిన్నమ్మ

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

First Published Dec 21, 2022, 2:02 PM IST | Last Updated Dec 21, 2022, 2:02 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ(బుధవారం) 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న జగన్ కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. మొదట తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు  కలిసివచ్చి టిటిడి పండితులు జగన్ కు వేదాశీర్వచనం అందించి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఆ తర్వాత క్రైస్తవ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి జగన్ ను ఆశీర్వదించారు. 

ఇక మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సీఎం జగన్ తో కేక్ కట్ చేయించి పుష్ఫగుచ్చాలు ఇచ్చి భర్త్ డే విషెస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా వైసిపి శ్రేణులు జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. 

Video Top Stories