తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి: సీఎం జగన్
అమరావతి: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయనను సీఎం జగన్ నివాళి అర్పించారు.
అమరావతి: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయనను సీఎం జగన్ నివాళి అర్పించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఆయన చిత్రపటంపై పూలుజల్లి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొని ప్రకాశం పంతులుకు నివాళులర్పించారు.
''తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి'' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.