Asianet News TeluguAsianet News Telugu

నా భర్త, కొడుకుకు ప్రాణహాని ... ఏమైనా జగన్ సర్కార్ దే బాధ్యత : అయ్యన్న భార్య పద్మావతి

అనకాపల్లి :  అక్రమంగా నిర్మించారంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిగోడ కూల్చివేతకు అధికారులు యత్నించడం ఇటీవల ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే.

First Published Nov 3, 2022, 10:09 AM IST | Last Updated Nov 3, 2022, 10:09 AM IST

అనకాపల్లి :  అక్రమంగా నిర్మించారంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిగోడ కూల్చివేతకు అధికారులు యత్నించడం ఇటీవల ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణానికి సంబంధించి తప్పుడు ప్రతాలను సమర్పించారన్న అభియోగాలపై అయ్యన్నపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడి ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేసారు. అయ్యన్న తనయుడు చింతకాయల రాజేశ్ ను కూడా సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని నర్సీపట్నంలోని ఇంట్లో అదుపులోకి తీసుకుని సిఐడి కార్యాలయానికి తరలించారు. ఏలూరు కోర్టులో అయ్యన్నపాత్రుడు, రాజేశ్ ను హాజరుపర్చనున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. అయితే తన భర్త అయ్యన్న, తనయుడు రాజేశ్ అరెస్టులపై స్పందిస్తూ వారిద్దరికి  ప్రాణహాని వుందని చింతకాయల పద్మావతి ఆందోళన వ్యక్తం చేసారు. వారికేమయినా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గోడలు దూకి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అధికారులు కనీసం బట్టలు మార్చుకునేందుకు, చెప్పులు వేసుకునేందుకు కూడా అవకాశమివ్వకుండా తోసుకుంటూ తీసుకెళ్లారని పద్మావతి తెలిపారు.