వైసిపిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చిచ్చు... భగ్గుమన్న ఎమ్మెల్యేలు, సీఎం జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం

అమరావతి: సాఫీగా సాగుతుందని భావించిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రి  పదవులు కోల్పోయిన వారు, మంత్రి పదవులు దక్కుతాయని ఆశించి భంగపడ్డ వారు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఇలా వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రి పదవి కొనసాగించకపోవడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు.
వెల్లంపల్లి ఇంటికి పార్టీశ్రేణులు పెద్దఎత్తున చేరుకుంటున్నాయి. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రిపదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. మంత్రి పదవి ఇవ్వనందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలంటూ ఆయన అనుచరులు ఆఫీస్ దగ్గర నిరసన తెలిపారు. ఇక అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కరణం ధర్మశ్రీ అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే  ధర్మశ్రీ అభిమానులు రోడ్డుపై సీఎం జగన్ దిష్టిబొమ్మతో పాటు టైర్లను దగ్ధం చేసారు. ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రిపదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాజీనామాకు సిద్దమయ్యారు. 

First Published Apr 11, 2022, 11:12 AM IST | Last Updated Apr 11, 2022, 11:12 AM IST

అమరావతి: సాఫీగా సాగుతుందని భావించిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. మంత్రి  పదవులు కోల్పోయిన వారు, మంత్రి పదవులు దక్కుతాయని ఆశించి భంగపడ్డ వారు అసమ్మతితో రగిలిపోతున్నారు. ఇలా వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రి పదవి కొనసాగించకపోవడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు.వెల్లంపల్లి ఇంటికి పార్టీశ్రేణులు పెద్దఎత్తున చేరుకుంటున్నాయి. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రిపదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. మంత్రి పదవి ఇవ్వనందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలంటూ ఆయన అనుచరులు ఆఫీస్ దగ్గర నిరసన తెలిపారు. ఇక అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కరణం ధర్మశ్రీ అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే  ధర్మశ్రీ అభిమానులు రోడ్డుపై సీఎం జగన్ దిష్టిబొమ్మతో పాటు టైర్లను దగ్ధం చేసారు. ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రిపదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాజీనామాకు సిద్దమయ్యారు.