మంత్రి పదవిని కలలో కూడా ఊహించలేదు...: ఎమ్మెల్యే రజిని

గుంటూరు: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రిపదవి దక్కించుకున్న వైసిపి ఎమ్మెల్యే విడుదల రజినికి సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో ఘనస్వాగతం లభించింది.

First Published Apr 11, 2022, 11:15 AM IST | Last Updated Apr 11, 2022, 11:15 AM IST

గుంటూరు: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రిపదవి దక్కించుకున్న వైసిపి ఎమ్మెల్యే విడుదల రజినికి సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో ఘనస్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా రజినికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రజిని మాట్లాడుతూ... ఒక సామాన్య బీసీ మహిళలనైన తనను ఎమ్మెల్యేను చేయడమే కాదు ఇప్పుడు మంత్రిగా అత్యున్నత బాధ్యతలను సీఎం జగన్ అప్పగించడం చాలా సంతోషంగా వుందన్నారు. తనకు మంత్రిపదవి దక్కుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తన మీద సీఎం జగన్ వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రజిని అన్నారు.