పిన్నెల్లికి మంత్రి పదవి దక్కకుంటే మూకుమ్మడి రాజీనామాలు: మాచర్ల ప్రజాప్రతిధుల హెచ్చరిక
మాచర్ల: తన మంత్రివర్గం మొత్తాన్ని రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి జగన్ కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మంత్రిపదవులపై వైసిపి ఎమ్మెల్యేలు ఆశలుపెట్టుకున్నారు. ఇప్పటికే సీఎం కూడా కొత్తగా మంత్రిపదవులు ఎవరెవరికి ఇవ్వాలన్నదానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నూతన మంత్రుల ఫైనల్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు ప్రచారమవుతున్నారు. మంత్రి పదవులు ఆశించిన కొందరి పేర్లు ఈ లిస్ట్ లో లేకపోవడం వైసిపిలో అలజడి సృష్టిస్తోంది. ఇలా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు కూడా ఈ లిస్ట్ లో లేదు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాలకు సిద్ధమంటూ నియోజకర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్నిహెచ్చరిస్తున్నారు. మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచుల సమావేశమై చర్చించారు. పిన్నెల్లికి మంత్రి పదవి రాకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వారు ప్రకటించారు.