జగన్ కు మాజీ హోంమంత్రి షాక్... స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా

అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలతో పాటు మంత్రిపదవులు కోల్పోయిన వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలు, పాత మంత్రుల అనుచరులు వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మంత్రి పదవి కోల్పోడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దపడ్డారు. పార్టీ తరపున తనతో చర్చించడానికి వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకటరమణకు సుచరిత స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా లేఖ అందచేసారు.  అయితే భేటీ అనంతరం మోపిదేవి వెళుతుండగా ఆయన కారును సుచరిత అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది

First Published Apr 11, 2022, 10:03 AM IST | Last Updated Apr 11, 2022, 10:03 AM IST