U1 జోన్ రైతుల నిరసనకు బిజెపి మద్దతు... అవసరమైతే జేపి నడ్డా దృష్టికి

తాడేపల్లి: తమ గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను U1 జోన్ లో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... వెంటనే దీన్ని ఎత్తివేయాలంటూ గతకొద్ది రోజులుగా తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి రైతులు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష టిడిపి వీరికి మద్దతు తెలపగా తాజాగా బిజెపి కూడా మద్దతిచ్చింది. ఇవాళ బాధిత రైతులను బిజెపి నేత పాతూరి నాగభూషణం కలుసుకుని బిజెపి మద్దతును ప్రకటించారు.  ''వ్యవసాయ భూములను 2016 లో టిడిపి ప్రభుత్వం రిజర్వ్ జోన్ గా ప్రకటించింది. అప్పటినుండి రైతులకు తిప్పలు తప్పడంలేదు. అప్పడు పెనంమీదవున్న రైతుల పరిస్తితి ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. రాజదానికి దూరంగావున్న ఈ ప్రాంత పొలాలు U1జోన్ గా ప్రకటించటం హాస్యాస్పదం. కాబట్టి రాజదానికి సంబందం లేని ఈ పొలాలను రిజర్వ్ జోన్ నంచి తొలగించాలని... లేదంటే కేంద్ర మంత్రి  జేపి నడ్డా దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని నాగభూషణం హామీ ఇచ్చారు. 
 
First Published May 2, 2022, 4:07 PM IST | Last Updated May 2, 2022, 4:07 PM IST