Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్... నీ పూర్వీకులూ పాపాత్ములేనా..!: బిజెపి విష్ణువర్దన్ రెడ్డి

అనంతపురం : టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేసేకంటే ముందే సంకుచిత మనస్తత్వాన్ని మార్చుకోవాలని ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు.

First Published Dec 12, 2022, 4:24 PM IST | Last Updated Dec 12, 2022, 4:24 PM IST

అనంతపురం : టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేసేకంటే ముందే సంకుచిత మనస్తత్వాన్ని మార్చుకోవాలని ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలకులు పాపాత్ములుగా పేర్కొంటూ ఏపీ ప్రజలను అవమానించేలా విద్యార్థుల పాఠ్యపుస్తకాలను కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. వెంటనే ఇలాంటివి పాఠ్యపుస్తకాలను నుండి తొలగించి ఏపీ ప్రజానికానికి క్షమాపణలు చెప్పాకే కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయాలని విష్ణువర్ధన్ డిమాండ్ చేసారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పాలకులను పాపాత్ములుగా చిత్రీకరిస్తూ తెలంగాణ విద్యార్థులలో విద్వేషాన్ని రేకెత్తించేలా పాఠాలను రూపొందించడాన్ని విష్ణువర్ధన్ తప్పుబట్టాడు. మీ పూర్వీకులది విజయనగరం జిల్లాయే కాదా... ఇలా ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళి స్థిరపడిన మీ పూర్వీకులు కూడా పాపాత్ములేనా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ఇతర రాష్ట్రాలపై విద్వేషాలకు పెంచే పాఠాలను తొలగించాకే ఏపీలో పర్యటించాలని ఏపీ బిజెపి డిమాండ్ చేస్తోందని విష్ణువర్ధన్ అన్నారు.