ఏపీ బిజెపి ''జలంకోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర'' ప్రారంభం...

శ్రీకాకుళం: వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను మధ్యలోనే అసంపూర్తిగా వదిలేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంతో పోరాటానికి  ఏపీ బిజెపి సిద్దమయ్యింది. 

First Published Apr 7, 2022, 4:12 PM IST | Last Updated Apr 7, 2022, 4:12 PM IST

శ్రీకాకుళం: వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను మధ్యలోనే అసంపూర్తిగా వదిలేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంతో పోరాటానికి  ఏపీ బిజెపి సిద్దమయ్యింది. ఇప్పటికే ''జలంకోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర'' పేరిట అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు బిజెపి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) శ్రీకాకుళం నుంచి బిజెపి జనపోరు యాత్ర మొదలయ్యింది. శ్రీకాకుళం నుండి ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తానన్నా ఎందుకు నిర్మాణం సాగించడం లేదని వీర్రాజు జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా ముందుకు సాగటం లేదన్నారు. నేటికీ ఇక్కడి ప్రజలు వలస పోవటం ప్రభుత్వ వైఫల్యం కాదా? వంశధార నాగావళి నదుల అనుసంధానం ఎందుకు ముందుకు సాగటం లేదు? అంటూ ప్రశ్నించారు.