Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నానిని అరెస్టు చేయండి: డీజీపీపై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్

రాష్ట్రంలో విగ్రహాల ద్వంసం కేసులో బిజెపి నేతలు ఉండారని డిజిపి సవాంగ్ చెప్పడం సిగ్గుచేటు అని బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  

First Published Jan 16, 2021, 3:03 PM IST | Last Updated Jan 16, 2021, 3:03 PM IST

రాష్ట్రంలో విగ్రహాల ద్వంసం కేసులో బిజెపి నేతలు ఉండారని డిజిపి సవాంగ్ చెప్పడం సిగ్గుచేటు అని బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో  పోలీసులు వైసిపి పార్టీకి కార్యకర్తలుగా  వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

మొదట సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్న వైసిపి కార్యకర్తలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేతనైతే పోలీసులు విగ్రహలను, దేవాలయాలను ద్వంసం చేయడానికి పరోక్షంగా రెచ్చగోట్టిన మంత్రి కొడాలి నానిని వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు.

పోలీస్ సంఘాల నాయకులు కోందరు పోలీస్ సంక్షేమం గాలికొదిలేసి కొందరు అధికారుల తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ఫాస్టర్ స్వయంగా విగ్రహాలను ద్వంసం చేశానని భహిరంగంగా పోలీసులకు ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నాడని ఆయన గుర్తు చేశారు..

ఆ ఫాస్టర్ వైసిపి నేతలతో తిరుగుతున్నాడని ఆయన అన్నారు. మరి అతను వైసిపికి చెందినవాడా, కాదా పోలీసులు సమాదానం చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కొందరు పాస్టర్లపై  చర్యలు తీసుకోకుండా పోలీస్, ప్రభుత్వం నిందితులకే  అండగా నిలుస్తున్నాయని విమర్శించారు.

ముఖ్యమంత్రి గానీ,హోం మంత్రి గానీ విగ్రహాల ద్వంసం విషయంలో నోరు మేదపక పోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. దేవాలయాలను పరిరక్షించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. డిజిపి 48 గంటల వ్యవధిలోనే మాట మార్చి ప్రకటనలు చేస్తున్నాడని, దీని వెనుక ఏవరి హస్తం ఉందో  ప్రజలకు తెలుసునని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.