Asianet News TeluguAsianet News Telugu
breaking news image

శ్రీవారి సేవల రేట్లపై టిటిడి ఛైర్మన్ వ్యాఖ్యలు... ఏపీ బిజెపి చీఫ్ వీర్రాజు సీరియస్

విజయవాడ: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామిని సేవించుకోవాలకునే భక్తులపై మరింత భారం మోపాలంటూ టిటిడి బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. శ్రీవారికి చేసే వివిధ సేవల రేట్లను భారీగా పెంచాలంటూ టిటిడి ఛైర్మన్ అధికారులను ఆదేశిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో టిటిడి బోర్డు, వైసిపి ప్రభుత్వంపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సీరియస్ అయ్యారు. హిందూ దేవాలయాలను ఆదాయాన్ని కుమ్మరించే వాటిగా చూస్తూ... క్రిస్టియానిటీ, మైనారిటీ అంటే ఓటు బ్యాంకుగా చూస్తున్నారని వీర్రాజు అన్నారు. హిందుత్వం అంటే వ్యాపారం కాదని పేర్కొన్నారు.సేవా టికెట్ రేట్లు పెంచడంపై టిటిడి పునరాలోచన చేయాలని సూచించారు. టిటిడి బోర్డు పరిపాలన ధర్మ బద్దంగా ఉండాలన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాల పరిపాలన ప్రజల చేతుల్లో ఉంటుందని సోము వీర్రాజు ప్రకటించారు. 