విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటన... షెడ్యూల్ ఇదే..: సోము వీర్రాజు
విజయవాడ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బిజెపి ఏర్పాట్లుచేస్తోందని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
విజయవాడ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బిజెపి ఏర్పాట్లుచేస్తోందని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని ఈ నెల (నవంబర్) 11న సాయంత్రం 6.25 గంటలకు విశాఖపట్నం విమానాశ్రాయానికి చేరుకుంటారని... అక్కడ ఆయనకు స్వాగతం పలుకుతామన్నారు. అనంతరం భారీ రోడ్ షో నిర్వహించనున్నట్లు... ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నామని అన్నారు.
ఇక 12వ తేదీన ఉదయం ఆంధ్రా యూనివర్సిటీ లోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రధాని బహిరంగ సభ వుంటుందని వీర్రాజు తెలిపారు. అంతకుముందే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రధాని ప్రారంభించనున్నారని అన్నారు. బహిరంగ సభ అనంతరం అంటూ 12.15 నిమిషాలకు ప్రధాని తిరుగుపయనం కానున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.