అనుమతులు లేకుండానే వినాయక చవితి వేడుకలు... దమ్ముంటే అడ్డుకొండి: సోము వీర్రాజు సవాల్

విజయవాడ : వినాయక చవితి వేడుకలపై వైసిపి ప్రభుత్వం నిబంధనలు విధించడంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. 

First Published Aug 29, 2022, 12:49 PM IST | Last Updated Aug 29, 2022, 12:49 PM IST

విజయవాడ : వినాయక చవితి వేడుకలపై వైసిపి ప్రభుత్వం నిబంధనలు విధించడంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. వినాయక నవరాత్రి ఉత్సవాలపై ఎలాంటి నిబంధనలు లేవంటూనే మండపాలకు ఫైర్, విద్యుత్, పోలీస్ పర్మిషన్స్ తీసుకోవాలని నిర్వహకులను ఆదేశిస్తున్నారు... ఇవి నిబంధనలు కావా? అని ప్రశ్నించారు. నిబంధనల పేరుతో హిందూ పండుగలను అడ్డుకోవాలని చూస్తే బిజెపి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను రాజమండ్రిలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటానని... ఈ వేడుకలకు ఎలాంటి అనుమతులు తీసుకోమన్నారు. దమ్ముంటే నన్ను అడ్డుకోండి... అరెస్ట్ చేయడం అంటూ సోము వీర్రాజు ఛాలెంజ్ చేసారు.