సతీసమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని
విజయవాడ : కృష్ణాష్టమి పర్వదినం రోజున ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
విజయవాడ : కృష్ణాష్టమి పర్వదినం రోజున ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న స్పీకర్ కు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఆలయ ఈవో దగ్గరుండి స్పీకర్ దంపతులకు అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు.