Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ అంతు చిక్కని వ్యాధి కలకలం: కుప్పకూలుతున్న మనుషులు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిలో ఏలూరు తరహా "వింత వ్యాధి" 

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిలో ఏలూరు తరహా "వింత వ్యాధి" లక్షణాలతో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి మనుషులు కళ్లు తిరిగి పడిపోతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కొమిరేపల్లి చేరుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలో ఏలూరులో అంతు చిక్కని వ్యాధి తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.