ఏపీ కేబినెట్ మీటింగ్ షురూ... రాజీనామాకు సిద్దంగా ఖాళీ లెటర్ హెడ్ లతో మంత్రులు

అమరావతి: ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమయ్యింది.

First Published Apr 7, 2022, 5:14 PM IST | Last Updated Apr 7, 2022, 5:14 PM IST

అమరావతి: ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమయ్యింది. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కొనసాగిన మంత్రివర్గానికి ఇదే చివరి సమావేశం కానుంది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులు మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నారు. రాజీనామా సమర్పణకు ఖాళీ లెటర్ హెడ్‌లతో మంత్రులు సమావేశానికి హాజరయ్యారని సమాచారం. రాజీనామా పత్రాలను గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లనున్న జీఏడీ అధికారులు కూడా సిద్దమయ్యారు. ఈ కేబినెట్ సమావేశం అనంతరం దాదాపు 25 మంది మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో ముగ్గురు లేదా నలుగురిని తిరిగి కేబినెట్​లోకి తీసుకునే అవకాశం ఉంది.  ఈనెల 11న కొత్త మంత్రిమండలి కొలుతీరనుంది కాబట్టి ఇదే ఈ కేబినెట్ చివరి సమావేశం కానుంది.