ఆనందయ్య కరోనా మందు... పంపిణీ ప్రాంతంలో అదుపుతప్పిన పరిస్థితి
కృష్ణపట్నం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ఆయుర్వేద మందును నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యా తయారుచేసిన విషయం తెలిసిందే.
కృష్ణపట్నం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ఆయుర్వేద మందును నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యా తయారుచేసిన విషయం తెలిసిందే. ఈ మందు కేవలం క్షణాల్లోనే కరోనాను నయం చేస్తుందని తెలిసి ఇరు తెలుగు రాష్ట్రాలనుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా కరోనా రోగులు కృష్ణపట్నంకు చేరుకుంటున్నారు. వేలల్లో ప్రజలు గుమిగూడటంతో
ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు తప్పింది. అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది.
ప్రస్తుతం అక్కడ 5 వేల మందికి మందు తయారు చేశారు. కానీ 35 వేల మంది మందు తీసుకోడానికి వచ్చారు. వీరిలో పాజిటివ్ పెషెంట్స్ ఎక్కువుగా ఉన్నారు. కేవలం కరోనా రోగులతో కూడిన అంబులెన్స్ లే 2 వేల వరకు వరుసలో ఉన్నాయి. ఇలా పరిస్థితి అదుపుతప్పేలా కనిపిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమై భారీగా బందోబస్తు చేపట్టారు.