Asianet News TeluguAsianet News Telugu

ఆంఫన్ తుఫాను : మే 20వ తేదీన తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆంఫన్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆంఫన్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ తెలిపారు. విశాఖ కైలాసగిరి కొండమీదున్న డాప్లర్ వెదర్ రాడార్ తో ట్రాక్ చేస్తున్నామని ఆయన తెలిపారు. మత్స్యకారులు వేటకు వెల్లొద్దని, తీరాల్లో మూడో నెం. ప్రమాద హెచ్చరిక చేయాలని సూచించామని అన్నారు.