Ambedkar Jayanti 2022: డా. బిఆర్ అంబేద్కర్ కు సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ నివాళి
అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.
అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సాంఘిక సంక్షేమశాఖమంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సామాజిక న్యాయసలహాదారు జూపూడి ప్రభాకర్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘరాం తదితరులు కూడా హాజరై అంబేద్కర్ ఫోటోకు నివాళులు అర్పించారు. ఇక ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు తదితర దళిత నేతలతో కలిసి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు లోకేష్.