ఉప్పల్ హెరిటేజ్ ఫ్యాక్టరీలో కరోనా కలకలం.. చంద్రబాబూ! నోరువిప్పు!!.. అంబటి రాంబాబు
హైదరాబాద్ లోని ఉప్పల్ హెరిటేజ్ ఫ్యాక్టరీ లో కరోనా కలకలం పై.. చంద్రబాబు ఎందుకు నోరు విప్పరు..!? బయటకు వచ్చి ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పరు..? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్ లోని ఉప్పల్ హెరిటేజ్ ఫ్యాక్టరీ లో కరోనా కలకలం పై.. చంద్రబాబు ఎందుకు నోరు విప్పరు..!? బయటకు వచ్చి ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పరు..? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో కొంతమందికి కరోనా వైరస్ సోకిందని.. వారందరినీ క్వారెన్ టైన్ కు పంపారన్నది వాస్తవమా..? కాదా..? దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి రోజూ సలహాలు ఇచ్చే చంద్రబాబు గారు.. ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బందికి కరోనా వైరస్ సోకడం వల్ల ఆందోళనలకు గురి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.