Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ చిత్రపటానికి అమరావతి మహిళల పాలాభిషేకం...

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అమరావతి ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు ఈ నెల అందరు పెన్షనర్లతో పాటే పరిహారం లభించింది.

First Published Dec 1, 2022, 4:22 PM IST | Last Updated Dec 1, 2022, 4:22 PM IST

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అమరావతి ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు ఈ నెల అందరు పెన్షనర్లతో పాటే పరిహారం లభించింది. ప్రతిసారి ఆలస్యంగా వచ్చే పెన్షన్ ఈసారి ఒకటో తేదీనే అందడంతో నిరుపేద కూలీల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో ఉండవల్లి, పెనుమాక, కృష్ణయపాలెం, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.పేద రైతుకూలీల బాధను సీఎం అర్థం చేసుకున్నారు... అందుకే వ్యవసాయ కూలీలకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులు ఆదేశించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆర్కే రైతుకూలీలకు పరిహారం అందజేశారు.