అమరావతి ఉద్యమం... మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద ఉద్రిక్తత
అమరావతి: మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది
అమరావతి: మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ వలయాలన్నింటిని చేధించుకుని ఆలయం వద్దకు చేరుకున్న కొందరు మహిళలు, పురుషులు జై అమరావతి నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో అక్కడినుండి తరలించారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతులు, మహిళలు న్యాయస్థానం టూ దేవస్థానం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిరసనలు, ర్యాలీలు జరక్కుండా రాజధాని ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. అయినప్పటికి కొందరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకుని అమరావతికి అనుకూలంగా నినదించారు.