రాజధాని రైతుల ఛలో డిల్లీ... విజయవాడలో డిల్లీ రైలెక్కిన అమరావతి రైతులు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించేలా చూడాలంటూ డిల్లీ పెద్దలను వేడుకోనున్నారు రైతులు. 

First Published Apr 3, 2022, 11:33 AM IST | Last Updated Apr 3, 2022, 11:33 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించేలా చూడాలంటూ డిల్లీ పెద్దలను వేడుకోనున్నారు రైతులు. ఈ మేరకు బిల్డ్ అమరావతి నినాదంతో ఢిల్లీ వెళ్తున్నారు రాజధాని రైతులు. ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున విజయవాడ రైల్వేస్టేషన్ లో ''సేవ్ అమరావతి-బిల్డ్ అమరావతి'' నినాదాలు చేస్తూ రైతులు డిల్లీ రైలెక్కారు. డిల్లీలో రాజకీయ ప్రముఖులను కలిసి అమరావతికి మద్దతివ్వాలని కోరడానికి ఈ ఛలో డిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు రైతులు వెళ్లడించారు.