అమరావతిలో ఆర్-5 జోన్... వ్యతిరేకించిన మందడం, లింగాయపాలెం గ్రామసభలు

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాలవారికి కూడా స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ఆర్‌-5 జోన్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 

First Published Nov 11, 2022, 1:27 PM IST | Last Updated Nov 11, 2022, 1:27 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాలవారికి కూడా స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ఆర్‌-5 జోన్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమరావతి ప్రజలు ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. అలాగే రాజధాని పరిధిలోని గ్రామాల ప్రజలు గ్రామసభలు ఏర్పాటుచేసుకుని ఆర్-5 జోన్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి హైకోర్టుకు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలోని మందడంలో పాటు తుళ్ళూరు మండలం లింగాయపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆర్-5 జోన్ ఏర్పాటును ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసారు.