వైసిపి ప్లీనరీకి సర్వం సిద్దం... ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు
గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి రోజునే వైసిపి పార్టీ ప్లీనరీని కూడా నిర్వహిస్తోంది.
గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి రోజునే వైసిపి పార్టీ ప్లీనరీని కూడా నిర్వహిస్తోంది. రెండురోజుల పాటు (శుక్ర, శనివారాలు) జరగనున్న వైసిపి ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార వైసిపి ఏర్పాట్లన్ని పూర్తిచేసింది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంలో వైసిపి ప్లీనరీకోసం భారీ ఏర్పాట్లు చేసారు. ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి వైసిపి శ్రేణులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసారు. వర్షాల నేపథ్యంలో భారీ షెడ్ లు ఏర్పాటుచేసారు. సుమారు నాలుగులక్షల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.