Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉదృతం... ప్రధాని పర్యటనతో విశాఖలో ఉద్రిక్తత

విశాఖపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ మరో మూడురోజుల్లో విశాఖకు రానున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఆందోళనలు మరోసారి ఉదృతమయ్యాయి.

First Published Nov 9, 2022, 11:20 AM IST | Last Updated Nov 9, 2022, 11:19 AM IST

విశాఖపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ మరో మూడురోజుల్లో విశాఖకు రానున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఆందోళనలు మరోసారి ఉదృతమయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ(బుధవారం) స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డుపైకి వచ్చి ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటికరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని ఆందోళనకు దిగారు. వడ్లపూడి వద్ద ఉద్యోగులు రోడ్డుపైనే ఆందోళన చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వెంటనే పోలీసులు నిరసనకారులను రోడ్డుపైనుండి పక్కకు జరిపి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. మకోవైపు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదంటూ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు. అయినా వెనక్కి తగ్గని కార్మిక సంఘాలు భారీగా గేట్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదుపుచేసే క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.