వరాహ లక్ష్మి నరసింహ స్వామి నిజరూప దర్శనానికి అన్ని ఏర్పాట్లు ... జిల్లా కలెక్టర్

ఈ నెల 23వ తేదిన జరగబోవు చందనోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు.  

First Published Apr 22, 2023, 11:29 AM IST | Last Updated Apr 22, 2023, 12:20 PM IST

ఈ నెల 23వ తేదిన జరగబోవు చందనోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చందనోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేది తెల్లవారుజామున 3 గంటల నుంచి 3.30 మద్య ఆలయ ధర్మకర్త మరియు వారి కుటుంబ సభ్యులతో పాటు దేవాదాయశాఖ మంత్రివర్యులు స్వామివారిని దర్శించుకుంటారని అదే సమయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 3.30 నుండి 4.30 గంటల మధ్య వివిఐపి దర్శనాలు, దేవస్థాన ట్రస్టు సభ్యులు స్వామి వారిని దర్శించుకుంటారన్నారు.  రూ 300/-లు, రూ 1000/-మరియు రూ1500/-  టిక్కెట్లలో దర్శన టైమింగ్స్ ను ముద్రించడం జరుగుతుందన్నారు. తెల్లవారుజామున 4.00 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు ఉచిత దర్శనంతో పాటు రూ.300/- మరియు రూ.1000/- దర్శనం టైమింగ్స్ తో కూడిన టిక్కెట్ల పై భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. అదే విధంగా వివిఐపి లు స్లాట్ 1 ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల మధ్య , స్లాట్ 2 ఉదయం 8.00 గంటల నుండి 10.00 మధ్య దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. మీడియాను ఉదయం 5.00 నుంచి 7.00 గంటల మధ్య   దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి 20 మీటర్లకు ఒక వాటర్ పాయింట్ ను దేవస్థానం మరియు జి.వి.ఎం .సి  ఏర్పాటు చేస్తున్నాయన్నారు.