Asianet News TeluguAsianet News Telugu

రక్తం కారుతుంటే తీసుకొచ్చారు.. సంతకాలకు కూడా కలవనివ్వడంలేదు..

టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ రాత్రి 11 గంటల సమయంలో అచ్చెన్నాయుడును ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. అచ్చెన్నాయుడుకు న్యాయసహాయం అందించేందుకు ఏసీబీ ఆఫీసు వద్దకు కొందరు న్యాయవాదులు వచ్చారు. అయితే, వారికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమను లోపలికి అనుమతించాలని పోలీసులతో న్యాయవాదుల వాగ్వాదానికి దిగారు. జగన్ ఏమైనా నాలుగొందల యేళ్లు పాలిస్తాడా..  ఇంత అన్యాయమా.. అంటూ మండిపడ్డారు.