Asianet News Telugu

నాకు జగన్ ఇచ్చిన కానుక ఇదీ: పృథ్వీ (వీడియో)

Jul 29, 2019, 5:58 PM IST

నటుడిగా, కమెడియన్ గా పృథ్వి రాజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పృథ్విరాజ్ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టాడు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో జగన్ కు మద్దతు తెలిపి వైసిపి తరుపున ప్రచారం నిర్వహించాడు. జగన్ పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు వ్యవహరిస్తున్న వైఖరిని మొదటిని నుంచి పృథ్విరాజ్ తప్పుబడుతున్న సంగతి తెలిసిందే.  ఇటీవల పృథ్వి రాజ్ కు టిడిడి ఎస్వీబిసి ఛానల్ చైర్మన్ గా పదవి లభించిన సంగతి తెలిసిందే. ఈ పదవి తనకు లభించడం చాలా సంతోషంగా ఉందని పృథ్వి అంటున్నాడు. ఇకపై సినిమాల్లో కొనసాగే విషయం గురించి మాట్లాడుతూ అవకాశం ఉంటే చేస్తానని అన్నారు. 

Video Top Stories