ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా బాధ్యత స్వీకరించిన సినీనటుడు అలీ...

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమితులైన సినీనటులు అలీ తాజాగా బాధ్యతలు స్వీకరించారు.

First Published Nov 8, 2022, 12:56 PM IST | Last Updated Nov 8, 2022, 12:56 PM IST

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమితులైన సినీనటులు అలీ తాజాగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్  అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కు చేరుకున్న అలీకి పౌర సంబంధాల శాఖ కమీషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా తనకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం అలీ మాట్లాడుతూ... ప్రజాభిమానం పొందిన మహానాయకుడు జగన్ అంటూ కొనియాడారు.  తండ్రి వైఎస్సార్ ను మించిన కొడుకుగా జగన్ కీర్తిప్రతిష్టలు పొందారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా వుండే నాయకుడు ఎవరైనా వున్నారంటే అది జగనేనని అలీ అన్నారు.