Asianet News TeluguAsianet News Telugu

నందిగామలో దారుణం... మాయమాటలతో నమ్మించి మైనర్ బాలికపై అత్యాచారం

నందిగామ : మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసారు. 

Jun 28, 2022, 4:39 PM IST

నందిగామ : మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసారు. నందిగామ నియోజకర్గ పరిధిలోని కంచికచర్ల మండలం పెరకలపాడు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన కస్తాల యలమందయ్య కన్నేసాడు. ఇటీవల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండురోజుల క్రితం బాలికను గుర్తించిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి బాలికను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. యలమందయ్య పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసారు. తాజాగా నిందితున్ని మీడియా ముందుకు తీసుకువచ్చారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో నిందితున్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ నాగేంద్రకుమార్ తెలిపారు. 
 

Video Top Stories