ఉంగుటూరు ఎంపిడివో కార్యాలయంలో ఏసిబి సోదాలు
గన్నవరం : భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపిడివో కార్యాలయంలో ఏసిబి (అవినీతి నిరోదక విబాగం) అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు.
గన్నవరం : భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపిడివో కార్యాలయంలో ఏసిబి (అవినీతి నిరోదక విబాగం) అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఎంపిడివో కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందంటూ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదులు అందడంతో ఇవాళ (శుక్రవారం) ఉదయాన్నే ఏసిబి అడిషనల్ ఎస్పీ మహేశ్వరరాజు నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. దాదాపు మూడుగంటల పాటు ఎంపిడివో కార్యాలయంలో రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో రికార్డుల్లో అవకతవకలు, నిధుల గోల్ మాల్ బయటపడినట్లు సమాచారం. కేవలం ఎంపిడివో కార్యాలయంలోనే కాకుండా పక్కనే వున్న తహసీల్దార్, వెలుగు, విద్యుత్ శాఖ కార్యాలయాల్లో కూడా ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.