Asianet News TeluguAsianet News Telugu

గన్నవరంలో దొంగల హల్ చల్... మాజీ ఎమ్మెల్యే ఇంట దొంగతనం, నగదు, నగలు ఛోరీ

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ఇంట్లో దొంగలు పడ్డారు. 

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ఇంట్లో దొంగలు పడ్డారు. ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో తాళం వేసి వున్న ఎమ్మెల్యే నివాసంపై దొంగల కన్ను పడింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోని అన్ని బీరువాలను బద్దలుగొట్టి వాటిలో ఉన్న విలువైన వస్తువులను దొగిలించారు. మిగతా వస్తువులు, దుస్తులను చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు. ఉదయం బాలవర్ధనరావు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలో ఉంచిన సుమారు లక్షా 50 వేల నగదు, కొంత  బంగారం పోయినట్లు తెలిపారు. వెంటనే ఇంట్లో జరిగిన దొంగతనంపై మాజీ ఎమ్మెల్యే ఉంగుటూరు పోలీసులకు సమాచారం అందించారు. 

Video Top Stories