ఉయ్యూరులో దారుణం.. కాన్పులో పిల్లతో పాటు గర్భసంచి బైటికి.. అనాథలైన పిల్లలు
ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామ నివాసి కనగాల ఆదిలక్ష్మి 25 కాన్పుకోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా సిబ్బంది నిర్లక్ష్యంతో మృత్యువాత పడింది.
ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామ నివాసి కనగాల ఆదిలక్ష్మి 25 కాన్పుకోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా సిబ్బంది నిర్లక్ష్యంతో మృత్యువాత పడింది. గైనకాలజిస్టు సెలవులో ఉండడంతో నర్సులు కాన్పు చేశారు. ఆ సమయంలో కడుపులోని బిడ్డతోపాటు గర్భసంచి కూడా బైటికి రావడంతో ఆదిలక్ష్మి పరిస్థితి విషమించింది. దీంతో ఉయ్యూరు నుండి విజయవాడకు తరలించారు. అక్కడికి వెళ్లిన కాసేపటికే ఆదిలక్ష్మి కన్నుమూసింది. ఆదిలక్ష్మికి అంతకుముందే మూడేళ్ల వయసుగల పాప ఉంది. దీంతో ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాథలయ్యారు.