Asianet News TeluguAsianet News Telugu

ఏలూరులో స్కూల్ ప్రహరీ గోడ పక్కన భారీ పేలుడు..ఒకరు మృతి...

ఏలూరు జిల్లా : ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలోని తాడేపల్లి శివారు హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్రహరీ గోడ పక్కన భయంకర శబ్దంతో పేలుడు సంభవించింది. 

First Published Dec 17, 2022, 2:16 PM IST | Last Updated Dec 17, 2022, 2:16 PM IST

ఏలూరు జిల్లా : ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలోని తాడేపల్లి శివారు హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్రహరీ గోడ పక్కన భయంకర శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని నూజివీడు ఆసుపత్రికి తరలించారు. దుర్గాప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందారు. శాంతుల మణికి స్వల్ప గాయాలయ్యాయి. యాజమాన్యం చెత్తను స్క్రాప్ కు అమ్మేశారు. అయితే ఆ చెత్తతో ప్లాస్టిక్ కెమికల్ డబ్బా ఉండటంతో భారీ ప్రేలుడు సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న నూజివీడు డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్, సీఐ అంకబాబు పరిశీలిస్తున్నారు.