చనిపోయిన ఆవు మాంసాన్ని తిని.. 70 మంది అస్వస్థత...
విశాఖ ఏజెన్సీ .మాడుగుల మండలం గడుతురు పంచాయతీ మలక పాలెంలో కలుషిత ఆహారం తిని 70 మంది గిరిజనులు అస్వస్థత పాలయ్యారు.
విశాఖ ఏజెన్సీ .మాడుగుల మండలం గడుతురు పంచాయతీ మలక పాలెంలో కలుషిత ఆహారం తిని 70 మంది గిరిజనులు అస్వస్థత పాలయ్యారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా చనిపోయిన ఆవు మాంసాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు. బాదితులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి అధికారులకు సూచించారు.