Asianet News TeluguAsianet News Telugu

యదేచ్ఛగా మద్యం మాపియా.. 605 బాటిళ్ల అక్రమ మద్యం పట్టివేత..

కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు.

కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. జి.కొండూరు మండల పరిధిలోని గంగినేని చెక్ పోస్ట్ ఇంకా పలు చోట్ల జరిపిన తనిఖీల్లో 605 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. 5 కేసులు నమోదు చేసి, 
10మందిని అరెస్టు చేసి, 6 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు.