Asianet News TeluguAsianet News Telugu
breaking news image

పెట్రోల్ బంకులో యువకుల వీరంగం ... దాడి చేసి నగదు, సెల్ ఫోన్లు చోరీ

నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద పెట్రోల్ బంక్ లో అర్ధరాత్రి నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. 

నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద పెట్రోల్ బంక్ లో అర్ధరాత్రి నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. సేల్స్ మెన్ పై విచక్షణా రహితంగా దాడిచేశారు. అడ్డొచ్చిన మరో సేల్స్ మెన్ ని నలుగురు యువకులు చితకబాదారు. ఇరువురిపై నలుగురు యువకులు దాడికి పాల్పడి, సెల్ ఫోన్ లు, నగదును లాక్కెళ్లారు.   అయితే, ఘటనకు పాల్పడిన యువకులు గంజాయి మత్తులో ఉన్నారని సేల్స్ మెన్ ల ఆరోపిస్తున్నారు. ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.